రెండు కప్పుల టీ తాగండి .... ఆరోగ్యంగా వుండండి!
ఒకప్పుడు టీ
తాగేవాళ్ళని అదో దురలవాటు వున్నా వాళ్ళని చూసినట్టుగా చూసేవారు.
'టీ ఎక్కువగా తాగకండర్రా ... పైత్యం చేసేస్తుంది' అంటూ మన ఇళ్ళల్లో పెద్దాళ్ళు
చివాట్లు కూడా పెట్టేవారు. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం 'టీ
తాగండి ... దానిని మించిన ఆరోగ్యదాయని మరొకటి లేదు' అంటూ సెలవిస్తున్నారు.
ముఖ్యంగా, టీ తాగే పురుషులలో ప్రోస్టేట్ కేన్సర్ తోకముడుస్తోందట. రోజుకి కనీసం రెండు కప్పుల తేనీరు సేవించే వారిలో ఈ కేన్సర్ ముప్పు 37 శాతం వరకు తగ్గిపోతోందని నెదర్లాండ్స్ లో జరిగిన తాజా అధ్యయనం వెల్లడించింది.
అక్కడి మాస్ట్రిక్ట్ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు దీనిపై పెద్ద కసరత్తు చేశారు. 892 మంది ప్రోస్టేట్ కేన్సర్ రోగులనీ, అంతే సంఖ్యలో పూర్తి ఆరోగ్యవంతుల్నీ తీసుకుని పరిశోధన చేశారు. వారి ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో తేలిందేమిటంటే, ప్రతిరోజూ టీ తాగే వారిలో ఈ కేన్సర్ ముప్పు తక్కువగా వుందట. కాబట్టి, రోజూ మీరు కూడా నిరభ్యంతరంగా తేనీరు సేవించండి!